సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (19:30 IST)

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

andhra pradesh
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి భారీ రూ.1,40,000 కోట్లు పెట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో రెండు దశల్లో 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానుంది. 
 
ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సమీపంలోని నక్కపల్లిలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. 
 
పరిశ్రమకు చెందిన మొదటి దశ జనవరి 2029 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. క్యాప్టివ్ అవసరాల కోసం పోర్ట్, రైల్వే యార్డుల ఏర్పాటుకు కూడా కంపెనీలు అనుమతి కోరాయి.