గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (10:00 IST)

అభిమానులను కాలితో తన్నిన బాలకృష్ణ... ఫ్లెక్సీలు తగలబెట్టిన ఫ్యాన్స్

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు వార్తల్లో నిలిచారు. ఇపుడు తనను కంటికి రెప్పలా కాపాడే ఫ్యాన్స్‌పై చేయి చేసుకుని వార్తలకెక్కాడు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు బాలకృష్ణ ఫ్లెక్సీలు, బ్యా

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు వార్తల్లో నిలిచారు. ఇపుడు తనను కంటికి రెప్పలా కాపాడే ఫ్యాన్స్‌పై చేయి చేసుకోవడమే కాకుండా కాలితో తన్ని వార్తలకెక్కాడు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు బాలకృష్ణ ఫ్లెక్సీలు, బ్యానర్లను తగలబెట్టారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మధిర నుంచి తల్లాడ మీదుగా సత్తుపల్లి సభకు వెళ్లేందుకు బాలకృష్ణ.. తన అభిమానులతో కలిసి వాహనాలతో ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో ఆ ర్యాలీ తల్లాడ మండలం మిట్టపల్లి వద్దకు చేరుకోగా.. అభిమానులంతా ఆయనతో కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు. 
 
ఈ క్రమంలో మండలంలోని నూతనకల్‌కు చెందిన నలుగురు అభిమానులు వాహనానికి అడ్డంగా నిల్చుని.. బాలకృష్ణతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే చీకటి పడుతుండటం, సత్తుపల్లి సభకు సమయం సమీపిస్తుండటంతో... ఆగ్రహం చెందిన బాలకృష్ణ వాహనం దిగి... ఆ నలుగురు అభిమానులపై పక్కకు తొలగండంటూ చేయిచేసుకున్నారు. బాలకృష్ణ తీరుతో క్రోపోదిక్తులైన అభిమానులు మిట్టపల్లి సెంటర్లో ఫ్లెక్సీలను చించి వాటిని దహనం చేశారు.