శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 7 మార్చి 2019 (18:54 IST)

జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నటి జయసుధ

సీనియర్ నటి జయసుధ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తను రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డిగారు అన్నారు. ఆమధ్య రాజకీయాల్లోకి వెళ్లను అని చెప్పిన మాట నిజమేననీ, ఐతే తిరిగి వైసీపీ కుటుంబ సభ్యురాలిగా వైసీపీ‌లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
 
వచ్చే ఎన్నికల్లో తను ఎక్కడి నుండి పోటీ చేయడం అనే అంశంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని జయసుధ చెప్పారు.