1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 4 జూన్ 2018 (20:50 IST)

ఛాతీపై ఆమె పచ్చబొట్టు... ఎఫైర్, 30 సార్లు ఫోన్ చేస్తే కట్ చేసింది... గొంతు కోసేశాడు...

ఆమె భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ వున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ యువకుడు. ఆమెకు తనే నిజమైన ప్రేమికుడినని తన ఛాతీపై ఆమె పేరును పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ఈ విషయాన్ని తను వుంటున్న గ్రామంలో అందరికీ చూపించేవాడు. ఐతే ఇ

ఆమె భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ వున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ యువకుడు. ఆమెకు తనే నిజమైన ప్రేమికుడినని తన ఛాతీపై ఆమె పేరును పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ఈ విషయాన్ని తను వుంటున్న గ్రామంలో అందరికీ చూపించేవాడు. ఐతే ఇటీవల ఆమె మరొకరితో సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో అత్యంత దారుణంగా ఆమెను నరికి చంపాడు. ఆమెతో పాటు చిన్నారిని కూడా పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఘటనా స్థలంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని తొప్పాతిపల్లె పంచాయతీలోని మర్రిగుంత దళితవాడలో పురుషోత్తం గంగవరానికి చెందిన వనితను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. పురుషోత్తం వ్యవసాయ కూలీ. ఐతే తన భార్య ప్రవర్తనపై పురుషోత్తానికి అనుమానం వచ్చి తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఎంతకీ భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నాలుగేళ్ల క్రితం పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత వనిత ఓ పాఠశాలలో ఆయాగా వుంటూ కాలం వెళ్లదీస్తోంది. 
 
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మరో యువకుడు శ్రీనివాసులు ఆమె ఇంటికి వస్తూపోతూ ఆమెకు దగ్గరయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమెతో సంబంధం కొనసాగిస్తూ ఆమె పేరును తన ఛాతీపై పచ్చబొట్టుగా పొడిపించుకుని ఆ దళితవాడలో అందరికీ చూపించి తనే నిజమైన ప్రేమికుడినని చెపుతుండేవాడు. ఈమధ్య వనిత తన ఇద్దరు బిడ్డలను తీసుకుని గంగవరం వెళ్లింది. ఊర్లోనే వున్న వనితకు శ్రీనివాసులు ఫోన్ చేశాడు. ఐతే ఆమె ఫోన్ కట్ చేసింది. ఐనా వదలకుండా చేస్తూనే వున్నాడు. ఆమె కూడా ఫోన్ కట్ చేస్తూనే వుంది. 
 
ఇలా అతడు 30 సార్లు చేయడం ఆమె 30 సార్లు కట్ చేయడం జరిగింది. ఆ మరసటిరోజు ఉదయాన్నే తన కుమార్తెను పుట్టింట్లో వదిలి కుమారుడితో తిరిగి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మృత్యువులా ఇంటికి వచ్చాడు శ్రీనివాసులు. నిద్రిస్తున్న వనిత మెడను నరికేసి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తల్లి పక్కనే నిద్రిస్తున్న బాలుడిని కూడా నరికి చంపేశాడు. ఆ తర్వాత అతడు ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో వున్న శవాలను చూసి స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.