బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:47 IST)

అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు: దేవినేని ఉమా

ప్రజా రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రకటించే వరకూ ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు.

అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు నిరసనగా 24 గంటల నిరాహార దీక్ష చేస్తున్న వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించి వారి దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 
 
"తొమ్మిది రోజులుగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు సుమారు  ఏడుగురు పైన దుర్మార్గంగా కేసులు పెట్టి నరసరావుపేట సబ్ జైలుకు రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకువచ్చారు. 
 
బేడీలు వేయడమే కాకుండా అందరికీ తెలియాలని ఆర్టీసీ బస్సులో తీసుకువచ్చి, ఉద్యమాలు చేసే వాళ్లును భయపెట్టాలని, అమరావతి రైతులు భయపెట్టలని ఎలాగైనా సరే ఉద్యమాలు జరక్కుండా చేయాలని చూస్తున్నారు.

321 రోజులుగా రైతులు మహిళలు పిల్లలు వృద్ధులు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి కొనసాగాలని ఉద్యమాలు చేస్తున్నారు. 
 
ఈ ఏడుగురు కుటుంబ సభ్యులు 24 గంటలు నిరసన దీక్షలు చేస్తున్నారు. రైతుల త్యాగాలు వెలకట్టలేనివి వీళ్లకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇవాళ వీళ్ళు భూములు ఇచ్చి రోడ్డు మీద పడ్డారు.

ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం 33 వేల ఎకరాలు 29 వేల మంది రైతులు రెండు మూడు పంటలు పండే భూములను ఇచ్చి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మంచి కంపెనీలు వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని ఈ రైతులు చేసిన త్యాగాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొంతు నొక్కాలని అన్యాయంగా అక్రమంగా రైతులను తీసుకువెళ్లి కేసులు పెట్టి బెదిరించి, ఆ రైతులను అరెస్టు చేసారు.
 
రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. దీనికి కచ్చితంగా జగన్మోహన్రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు. రైతులకు బేడీలు వేయడం రాష్ట్రం మొత్తం కూడా తీవ్రంగా ఖండించింది. 
 
ఆ రైతులకు మద్దతుగా జైల్ భరో కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా రైతులు గుంటూరు వెళ్తే కర్కశంగా మహిళా రైతుల పైన దాడులు చేశారు పోలీసులు. 
 
ఆరోజు అంజనీదేవి అనే మహిళా రైతును వ్యాన్ లో పడేస్తే కాలుకు దెబ్బ తగిలింది. ఆ తల్లిని వెళ్లే పరామర్శించి వస్తున్నాను.  మహిళా రైతులను అని కూడా చూడకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? 
 
ఇంట్లో నుంచి బయటకు రాని మహిళా తల్లులను ఈరోజు ఈ విధంగా జైలుకు తీసుకెళ్తా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తా లాఠీతో కొట్టించడం చాలా దుర్మార్గం.

ఈ దుర్మార్గాలు ఈ అక్రమాలు ఎంతోకాలం సాగవు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. మనం మన స్థలంలో కూర్చొని శాంతియుతంగా ఉద్యమం చేయడానికి కూడా జగన్మోహన్రెడ్డి ఇష్టపడటం లేదు.

ఎలాగైనా సరే ఉద్యమాలు జరగకుండా చూడాలని కొంతమంది వ్యక్తులను పంపించి ఉద్యమాన్ని అణచివేయాలని ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు" అని మండిపడ్డారు.