ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (17:07 IST)

ఆనందయ్య నాటు మందుకు త్వరలో తిరిగి మోక్షం

ఆనందయ్య నాటు మందుకు త్వరలో తిరిగి మోక్షం కలగనుంది. నెల్లూరు నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఈ మందు విషయమై కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు.
 
కరోనా నాటు మందుకు త్వరలో అన్ని అడ్డంకులు తోలగిపోతాయన్నారు. సిఎం జగన్ సహకారంతో ఎపి ప్రజలకు నాటు మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆయుష్ కూడా నాటు మందును మెచ్చుకుందన్నారు.
 
కాగా ఎమ్మెల్యే కాకాణి గారి సపోర్ట్ వల్ల పోలీసులు, రెవిన్యూ శాఖల నుండి తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదనీ, తను క్షేమంగ ఉన్నానని వెల్లడించారు ఆనందయ్య.