శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 మే 2021 (15:59 IST)

ఆనందయ్యను అరెస్టు చేసారా?

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ఆనందయ్య. ఇప్పుడు దేశంలో మారుమోగిపోతున్న పేరు. కరోనావైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ఆయన ఇస్తున్న ఆయుర్వేద మందు అద్భుతంగా పనిచేస్తుందనే వార్త గత నాలుగైదు రోజుల నుంచి హల్చల్ చేస్తోంది. దీనితో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా బాధితులతో కిక్కిరిసిపోయింది. మందు కోసం క్యూ కట్టారు. రోడ్లన్నీ దాదాపు 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక జామ్ అయింది.
 
మరోవైపు ఆయుర్వేద మందును ఆయుష్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆ ఔషధం పనితీరు గురించి తెలుసుకున్న తర్వాత దానిని పంపిణీ చేయాలా వద్దా అన్న దానిపై నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకూ మందు పంపిణీ చేయరాదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఇదిలావుంటే రాత్రి ఆనందయ్యను పోలీసులు తీసుకుని వెళ్లడంతో ఆయనను అరెస్ట్ చేసారనే వార్తలు వచ్చాయి. ఐతే మందు పంపిణీ లేదని చెప్పినప్పటికీ జనం మాత్రం ఆయన ఇంటికి వస్తూనే వున్నారు. ఈ నేపధ్యంలో ఆనందయ్యకు రక్షణ కల్పించేందుకు పోలీసులు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనందయ్య పోలీసుల సంరక్షణలో వున్నారు.