1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (09:27 IST)

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.2500 కోట్లు ఇచ్చాం : కేంద్రం

amaravathi buildings
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం రూ.2,500 కోట్ల మేరకు నిధులు కేటాయించామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిధులతో రాజధాని అమరావతి ప్రాంతంలో రాజ్‌భవ్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి సహా ఇతర్ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఆర్థికసాయం అందించాలి. దీంతో కేంద్రం ప్రభుత్వం రూ.2500 కోట్లు విడుదల చేసింది. 2021-15లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన రూ.వెయ్యి కోట్లు కూడా ఇందులో ఉన్నాయని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
 
విభజన చట్టంలోని సెక్షన్-6 ప్రకారం ఏపీ కొత్త రాజధానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి, విభజన చట్టం రూపొందించిన ఆరు నెలల్లోపు తగిన ప్రతిపాదనలు చేసేందుకు కేంద్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. అలాగే, కేంద్రం 28 మార్చి 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన కమిటీ ఏపీకి కొత్త రాజధాని ఎంపికలో తీసుకోవాల్సిన అంశాల గురించిన మార్గదర్శకాలతో అదే యేడాది ఆగస్టు 30న నివేదిక సమర్పించింది.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తేల్చి చెప్పింది. విభజన చట్టం మేరకు ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని గుర్తు చేసిందని స్పష్టం చేశారు.