మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (15:29 IST)

మీడియా పాయింట్ జర్నలిస్టులను అడ్డుకున్న మార్షల్స్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున అసెంబ్లీ మార్షల్స్ జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మార్షల్స్ దురుసు ప్రవర్తన వివాదాస్పదం కావడంతో ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి కలుగజేసుకోవడంతో సద్దుమణిగింది. 
 
మీడియా పాయింట్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్ళనియకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరో మార్గంలో చుట్టూ తిరిగి రావాలని మార్షల్ అదేశాలంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. చీఫ్ మార్షల్ వచ్చే సమయంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అటుగా రావడంతో ఈ వివాదం సద్దుమణిగింది. 
 
ఐఎండీపీఆర్ డీడీ చొరవతో అడ్డుపెట్టిన భారీ తాడు అడ్డు తీసి దారి వదిలారు. అసెంబ్లీ భద్రత సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీతో మాట్లాడి మీడియా ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా చూస్తానని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.