శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (08:41 IST)

ఈ నెల 24 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందని మంత్రి కన్నబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకురాకపోతే టెండర్లు పిలుస్తామని చెప్పారు.

‘‘ఇసుకను ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా తెచ్చుకోవచ్చు. ఇసుకను సొంత వాహనాల్లో తరలించుకోవచ్చు. ఈ నెల 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభిస్తాం.

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్‌ బియ్యం సరఫరా చేస్తాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు.. వాహనాలకు జీపీఎస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తాం. విజయవాడ, విశాఖలో కొండలపై ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొండలపై ఇళ్ల నిర్మాణంతో మౌలిక వసతుల కల్పన కష్టంగా మారింది.

ఆక్రమణలపై చర్యలకు అధికారుల కమిటీ ఏర్పాటు చేశాం. మున్సిపల్‌శాఖ కమిషనర్‌ చైర్మన్‌గా నలుగురితో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ 6 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. 16 మెడికల్ కాలేజీలకు భూములు కేటాయించాం’’ అని కన్నబాబు తెలిపారు.