బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (05:22 IST)

నవంబరు 15 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

ఏపీ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెషన్స్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. నవంబరు 15 తర్వాత వారం రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

నవంబరు 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి భేటీకానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి.. ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై మంత్రిమండలి భేటీ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను నవంబరు 2 లోపు సమర్పించాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు నవంబర్‌లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా అన్నారు.