గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (09:21 IST)

ఈ నెల 16వ తేదీ ఏపీ కేబినెట్ భేటీ - సీఎస్ ఆదేశాలు జారీ

neerabh kumar prasad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీన జరుగనుంది. కేబినెట్ భేటీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. నిజానికి ఈ కేబినెట్ భేటీ ఈ నెల 10వ తేదీన జరగాల్సివుంది. అయితే, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అకాల మరణం ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు 14వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సమర్పించాలని తెలియజేశారు. 
 
రతన్ టాటా మృతితో ఈ నెల 10వ తేదీన జరిగిన మంత్రి మండలి భేటీలో అజెండా వాయిదాపడింది. దీంతో కేబినెట్ నిర్వహణ తేదీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మరోసారి ఖరారు చేశారు. ఈ భేటీలో చెత్తపన్ను రద్దు, పీ-4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలిండెర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు. 
 
అంతేకాకుండా, స్వర్ణకారుల కార్పొరేన్ ఏర్పాటు, దేవాలయాల పాలక మండళ్ళలో ఇద్దరు బ్రాహ్మణులకు తప్పనిసరిగా చోటు కల్పించడం తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తుంది. అలానే రాజధాని అమరావతి నిర్మాణాలు, పోలవరం ప్రాజెక్టులపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.