సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (19:20 IST)

గ్రామ స‌చివాల‌యాల్లో బ్యాంకుల ఏటీఎం సేవ‌లు!

ఏపీ సీఎం తాను వినూత్నంగా ఏర్పాటు చేసిన గ్రామ స‌చివాల‌యాల‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్ళాల‌ని ప్ర‌ణాళిక‌లు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే గ్రామ స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్లు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇపుడు గ్రామ స‌చివాల‌యాల్లోనే ఏటీఎం సేవ‌లు కూడా బ్యాంకులు క‌ల్పించాల‌ని సీఎం అంటున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన తాడేప‌ల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా, సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలందించాల‌ని సీఎం అన్నారు. 
 
 
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు పెట్టేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాల‌ని సీఎం జగన్ అన్నారు. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయ‌ని, ఇప్పటికే జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని చెప్పారు. దీంతోపాటు రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతాయ‌ని తెలిపారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌సేవలు విస్తృతం కావాల‌ని, ఏటీఎం సహా ఇతర ఆర్థిక కార్యకలాపాలకు స‌చివాల‌యాలు వేదికగా మారాల‌న్నారు. 

 
దీనివల్ల బ్యాంకింగ్‌ సేవలు వారి గ్రామంలోనే ప్రజలకు లభిస్తాయ‌ని, గ్రామీణ వ్యవస్థల్లో ఇదో గొప్ప మార్పునకు దారితీస్తుంద‌న్నారు. పైలట్‌ప్రాజెక్ట్‌గా కొన్ని కేంద్రాల్లో ప్రారంభించి, తర్వాత విస్తరిస్తామని బ్యాంకర్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పైలెట్‌ప్రాజెక్టుగా ప్రారంభించామని తెలిపారు.