గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (19:39 IST)

రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత ఆర్థిక సాయం..

గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరుపున పది లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వం రమ్య కుటుంబానికి పది లక్షల ఎక్స్ గ్రేషియోను ప్రకటించిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

అయితే తొలుత చెక్కును తీసుకునేందుకు రమ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. రమ్య హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
తర్వాత అధికారులు నచ్చ చెప్పడంతో చెక్కును తీసుకున్నారు. రమ్య మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ప్రజాసంఘాలు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.