గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (14:24 IST)

కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో మూసివేత.. విదేశీయుల ఆందోళన

Kabul
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్‌లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. 
 
వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. 
 
ఇక ఇదిలా ఉంటే, కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం రేగడంతో ఎయిర్‌పోర్ట్‌ను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సివిల్ ఏవియేషన్‌కు అనుమతులు ఇవ్వడం లేదని ప్రకటించారు. వెంటనే ఈ ఉత్తర్వులు అమలులోకి రావడంతో పలు దేశాలు తమ విమానాలను దారి మళ్లించాయి. ఢిల్లీ-చికాగో విమానంను దారిమళ్లించారు. 
 
కాబూల్ నుంచి ఇండియా దౌత్యవేత్తులు, అధికారులు, వ్యాపారం నిమిత్తం ఆ దేశం వెళ్లిన వారిని ఇండియారు తీసుకొచ్చేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండు ఎయిర్ ఇండియా విమానాలను సిద్ధంగా ఉంచింది. పంజాబ్ కు చెందిన 200 మంది కాబూల్‌లో ఉన్నారని, వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని పంజాబ్ ముఖ్యమంత్రి విదేశాంగ శాఖమంత్రిని విజ్ఞప్తి చేశారు.