బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 27 జూన్ 2018 (22:21 IST)

పాదయాత్ర కాదు.. పనికిరాని యాత్ర - జగన్ పైన పరిటాల సునీత ఫైర్

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్స

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్సించారు. చంద్రబాబును తిట్టేందుకు పాదయాత్ర జగన్ చేపట్టారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఎంత బురద చల్లాలని జగన్ ప్రయత్నించినా ఫలితం ఉండదన్నారు పరిటాల సునీత.
 
ముందస్తు ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని, జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రాకున్నా.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఎపిలో అభివృద్ధిని మాత్రం చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారన్నారు మంత్రి పరిటాల సునీత.