సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (17:09 IST)

జగన్ పాదయాత్రకు 200 రోజులు.. బంగీ జంప్ వైరల్.. (వీడియో)

సుదీర్ఘ పాదయాత్రకు నడుం బిగించిన ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ

సుదీర్ఘ పాదయాత్రకు నడుం బిగించిన ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ  వెనక్కి తగ్గని ఆయన పాదయాత్రను కొనసాగించారు. వణికే చలితో మొదలెట్టి.. మండే ఎండను లెక్క చేయకుండా జగన్ పాదయాత్రను కొనసాగించారు. 
 
తన పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకూ వైఎస్ జగన్ 2434.2 కిలోమీటర్లు నడిచారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి ఏపీలోకి తేవటమే తన సంకల్పమని.. అలా చేసి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తన లక్ష్యమని 200 రోజుల పాటు పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. గత ఏడాది తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటకు వైసీపీ అధినేత జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్‌పై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి ఈ వీడియోను...