మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (16:10 IST)

గాంధీ - పూలే - అంబేద్కర్‌లా కనిపిస్తున్న జగన్ : బీసీ ఐక్య వేదిక నేతలు

నగరంలోని లబ్బిపేట బీసీ ఐక్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే ఖర్ల సమావేశంలో బీసీ ఐక్య వేదిక నాయకులు బుద్ధ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి సమాన హక్కులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. 
 
బలహీన వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగబద్ధ పదవులను కల్పించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... గాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌గా కనిపిస్తున్నారని ఆయన కొని యాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చారన్నారు. 
 
గతంలో బలహీన వర్గాలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును రైతుల మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. వంచనకు ప్రతి రూపం చంద్రబాబు అయితే నమ్మకానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.