ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (14:30 IST)

#APBudget2019 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ హైలైట్స్..

ఆంధ్రప్రదేశ్ 2019-20 బడ్జెట్‌ అంచనా రూ.2,26,117.53కోట్లు కాగా.. ఆర్థికలోటు 32, 390.68కోట్లుగా అంచనా వేశారు. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భాగంగా పలు పథకాలకు బడ్జెట్‌ను కేటాయిస్తూనే... కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టారు. వీటికి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు.
 
అవేంటంటే.. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన - రూ. 100 కోట్లు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం - రూ. 400 కోట్లు, డ్రైవర్ల సాధికార సంస్థ - రూ. 150 కోట్లు, త్రియ కార్పొరేషన్ - రూ. 50 కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల ప్రకటించారు. 
 
ఇంకా యనమల బడ్జెట్ ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పసుపు - కుంకుమ పథకానికి రూ. 4 వేల కోట్ల కేటాయింపు.
ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగులకు చేయూత
నిరుద్యోగ భృతి రూ. 1,000 నుంచి రూ. 2,000కు పెంపు
వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,242.64 కోట్లు
ప్రాథమిక విద్యకు రూ. 22,783.37 కోట్లు
 
ఉన్నత విద్యకు రూ. 3,171.63 కోట్లు
వైద్య శాఖకు రూ. 10,032.15 కోట్లు
హోమ్ శాఖకు రూ. 6,397.94 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ. 4,079.10 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ. 16,852.27 కోట్లు
 
పరిశ్రమల శాఖకు రూ. 4,114.92 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 7,979.34 కోట్లు
కార్మిక, ఉపాధి శాఖలకు రూ. 1,225.75 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 3,408.66 కోట్లు
చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 400 కోట్లు
 
డ్రైవర్ల సాధికారత కోసం రూ. 150 కోట్లు
క్రీడలు, యువజన శాఖకు రూ. 1,982.74 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌, కో-ఆపరేటివ్‌కు రూ.12,732.97కోట్లు
పాడి పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,030.87కోట్లు
అన్న క్యాంటీన్లకు రూ.300కోట్లు
వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం రూ.10,401కోట్లు 
 
ఎన్టీఆర్‌ విదేశీ విద్య పథకానికి రూ.100కోట్లు
రాష్ట్రంలో రైల్వేలైన్ల నిర్మాణానికి రూ.150కోట్లు
స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 458.66 కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల ప్రకటించారు.