శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (19:19 IST)

ఏం అబ్జెక్షన్ నీది? రోషం లేనోళ్లమా..? ఎవరికి ఊడిగం చేస్తారు?

ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా తన ప్రసంగానికి అడ్డు తగిలిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆ సమయంలో అబ్జక్షన్ అంటూ విష్ణుకుమార్ రాజు అనగానే చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 
 
ఊడిగం చేస్తున్నారా రాష్ట్రంలో అంటూ అడిగారు. ఎవరికి ఊడిగం చేస్తారు. అడిగేవారు లేరని మీ ఇష్టప్రకారం చేస్తారా? ఏం చేస్తారయ్యా మమ్మల్ని? జైలులో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం.. ఆవేదన వుండదా? ఏపీకి ఏమిచ్చారయ్యా..? తమిళనాడు, గుజరాత్‌కు ఏమిచ్చారో తెలుసుకోవాలి. పోల్చి చూడండి. కొత్త రాష్ట్రమొస్తే సపోర్ట్ చేసేదిపోయి.. ఇబ్బందులు పెడుతున్నారా.. రోషం లేనోళ్లమా.. అంటూ బీజేపీ ఎమ్మెల్యేలపై చిందులేశారు.
 
అయినా అబ్జెక్షన్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా..? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు" అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.