కేసీఆర్ దూరదృష్టిగల నేత : అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi
సందీప్| Last Updated: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:47 IST)
రైతుల కోసం బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 6 వేల సహాయం కాపీ ప్రక్రియ అని, బీజేపీకి కాపీ కొట్టడం తప్ప మరేమీ తెలియదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి దూరదృష్టి లేదని సొంత ఆలోచనలు చేయడం చేతకాదని ఆరోపించారు. కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి మెరుగులుదిద్ది దేశవ్యాప్తంగా ప్రకటించడం బీజేపీ అసమర్థతను చాటుతుందన్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి ప్రశంసిస్తూ, కేసీఆర్ వంటి నేత జాతికి ఎంతో అవసరమన్నారు. కేసీఆర్ పథకాలను పరిశీలిస్తే అతని రాజకీయ వివేచన, దూరదృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుందని కొనియాడారు. వ్యవసాయ సంక్షోభాన్ని సీఎం కేసీఆర్ పరిష్కరించినట్లుగా ఎవరూ పరిష్కరించలేదన్నారు.

రాష్ట్రాన్ని పురోగతి వైపు మళ్లించారన్నారు. పలు వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత, కేటీఆర్ మరియు పలువురు నేతలు మాట్లాడుతూ తెలంగాణలో అన్నదాతల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్నే బీజేపీ సర్కార్ పేరు మార్చి దేశవ్యాప్తంగా ప్రకటించిందని విమర్శించారు.దీనిపై మరింత చదవండి :