సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:46 IST)

ప్రముఖ కార్టూనిస్టు నిఖిల్ పాయ్ ఆత్మహత్య

ప్రముఖ కార్టూనిస్టు, ఫుడ్‌బ్లాగర్ నిఖిల్ పాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగుళూరులోని ఆయన నివాసంలో విషం సేవించి ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన వయసు 28 యేళ్లు. ఎంతో ప్రాచూర్యం పొందిన త్రీ హంగ్రీ మ్యాన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్ బ్లాగర్‌‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన వ్యక్తిగత కారణాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మంగుళూరు ఆస్పత్రిలో శవపరీక్ష చేశారు. కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తన స్నేహితులు రాజత్ రావు, కోలిన్ వెర్నోన్ డిసౌజాలు కలిసి ఈ ఫుడ్ బ్లాగర్‌ను ఏర్పాటు చేసి... దేశవ్యాప్తంగా అనేక పేరొందిన రెస్టారెంట్లలో ఈవెంట్స్ నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మంగుళూరు యువతలో మంచి ఆదరణ కూడా పొందారు. తండ్రి చనిపోయిన తర్వాత వ్యాపారాలను చూసుకుంటూ కార్టూనిస్టుగా, ఫుడ్‌బ్లాగర్‌గా కొనసాగుతూ వచ్చిన నిఖిల్ పాయ్ మరణంతో ఆయన కుటుంబ తీవ్ర విషాదంలో కూరుకునిపోయింది.