1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (09:51 IST)

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి  గురువారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలవనున్నారు. వీరిద్దరి మధ్య  గురువారం మధ్యాహ్నంల12.30 గంటలకు క్యాంప్ ఆఫీసులో ఈ భేటీ జరగనుంది. 
 
సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన సమావేశమని సమాచారం. ఈ సందర్భంగా సినిమా టిక్కెట్ల అంశంపై చర్చించే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి.