సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (18:46 IST)

సినీ ప‌రిశ్ర‌మ‌కు కుల‌గ‌జ్జి అంటిస్తారా? వివేకా హ‌త్య కేసు న‌త్త‌న‌డ‌క మీవల్లే!

చివ‌రికి సినీ ప‌రిశ్ర‌మ‌కు కూడా ఏపీ సీఎం జ‌గ‌న్ కుల గ‌జ్జిని అంటిస్తున్నార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమ‌ర్శించారు. వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు నత్తనడక నడుస్తోందని, సీబీఐ దర్యాప్తు చేపట్టి రెండేళ్లు అయినా, అసలు నేరస్తులను గుర్తించలేకపోవడానికి కారణమేమిటని ప్ర‌శ్నించారు. 
 
 
సినిమా వాళ్లపై ఈ ప్రభుత్వం కక్షకట్టిందా అని ప్ర‌శ్నించారు. కులాల ప్రస్తావన సినిమా పరిశ్రమలో ఎందుకు తీసుకొస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సినీపరిశ్రమను రాజకీయా ల్లోకి లాగి, వారికి కులగజ్జి అంటించాలని చూడటం ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ప్రజలు అధికారమిచ్చి, ముఖ్యమంత్రిని చేసింది కులాల కుంపట్లు పెట్టడానికి కాదని గుర్తుంచుకోవాల‌న్నారు. 
 
 
ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అధికారి కూడా సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన అధికారే. అయినా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కుంటినడక నడుస్తోంది. ఏ శక్తి వివేకానందరెడ్డి హత్య కేసు కొలిక్కిరాకుండా అడ్డుపడుతోంది. ఏ శక్తి అసలు ముద్దాయిలు పట్టుబడకుండా అడ్డుకుంటోంది ఎవ‌రు అని ప్ర‌శ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షనేత హోదాలో 15మార్చి 2019న వివేకాందరెడ్డి హత్యకేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై తనకు నమ్మకంలేదని, చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసే ఈ హత్య చేయించారని కూడా ఆరోపించారు. 16మార్చి2019న పెద్ద కాన్వాయ్ తో వెళ్లి, ఆంధ్రా పోలీసులపై తనకు నమ్మకంలేదని గవర్నర్ ను కలిసి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని జగన్మోహన్ రెడ్డి కోరారు.
 
 
 మార్చి 19, 2019న కేసుని నిష్పక్షపాత దర్యాప్తుకుఅప్పగించాలని కోరుతూ హైకోర్ట్ లో పిటిషన్ కూడా వేశారు. ఆయన పిటిషన్ వేసిన తర్వాత, వివేకానందరెడ్డి కుమార్తె, భార్య కూడా పిటిషన్లు వేశారు. వారితోపాటు, హత్యకేసులో ఏ టీడీపీనేతలప్రమేయముందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడో, వారుకూడా సీబీఐ దర్యాప్తు కావాలంటూ పిటిషన్లు వేశారు. ఆనాడు ప్రతిపక్షనేతగా అంతహడావుడి చేసిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రముఖ్యమంత్రిగా పగ్గా లు చేపట్టాక కేసుదర్యాప్తును ముమ్మరంచేయకపోగా, హైకోర్ట్ లో తాను వేసిన పిటిషన్ ను కూడా ఫిబ్రవరి06-2020న వెనక్కు తీసుకున్నారు. ఎందుకలా చేశార‌ని ముఖ్యమంత్రిని వ‌ర్ల రామ‌య్య ప్ర‌శ్నించారు.