1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

శ్రీశైలంలో ఈ నెల 15 నుంచి దసరా మహోత్సవాలు - సీఎం జగన్‌కు ఆహ్వానం

invitation to jagan
శ్రీశైలంలోని శ్రీమల్లిఖార్జున స్వామి భ్రమరాంభిక దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి దసరా మహోత్సవాలను ఏపీ ప్రభుత్వం అత్యంత వైభంగా నిర్వహించనుంది. ఈ నెల 24వ తేదీవరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ వేడుకలకు రావాలని ఏపీ సీఎం జగన్‌ను దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. 
 
మంత్రి వెంట శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవాదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ కరికాల వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో పెద్దిరాజు తదితరులు ఉన్నారు. ఆహ్వాన పత్రికను అందజేసిన సందర్బంగా సీఎం జగన్‌కు వేదపండింతులు ఆశీర్వాదం అందజేశారు. 
 
అలాగే, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషర్ సత్యనారాయణకు, ఆలయ ఈవో పెద్దిరాజు ఆహ్వానపత్రికను అందజేసారు. ఈ సందర్భంగా వారికి వేదపండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.