సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 21 డిశెంబరు 2021 (18:12 IST)

నంద్యాలలో సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు నిర్వహించిన ఎమ్మెల్యే శిల్ప దంప‌తులు

ఏపీ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దంప‌తులు ప‌లు కార్య‌క్ర‌మాలు చేశారు. నంద్యాల‌లో ఉచిత కంటి వైద్య శిబిరం, ర‌క్తదాన శిబిరం నిర్వ‌హించారు. ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొక్కలు నాటారు. 
 
 
ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మరెన్నో జరుపుకోవాలని శిల్పా దంప‌తులు కోరుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా 30 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పేద ప్రజల కష్టాలను తీర్చే నాయకుడిగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేవిధంగా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఆయన ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. 
 
 
రాష్ట్రంలో పేద ప్రజలకు అందిస్తున్న పథకాలపై తెలుగుదేశం నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తెలుగుదేశం పార్టీని నమ్మి పరిస్థితులలో ప్రజలు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాష, శిల్పా మహిళా సహకార్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాభున్నిసా, మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి. మున్సిపల్ వైస్ చైర్మన్స్ గంగి శెట్టి శ్రీధర్,పామ్ శవలి, నంద్యాల మండలం జెడ్ పి టి సి గోకుల్ కృష్ణారెడ్డి ,నంద్యాల మండల అధ్యక్షుడు ప్రభాకర్ , మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన, మార్కెట్ యార్డ్ చైర్మన్ మెడ సుబ్బలక్ష్మి వైయస్సార్ సిపి నాయకులు దేశం సుధాకర్ రెడ్డి రామలింగారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.