రెండు రోజుల పాటు కడపలో సీఎం జగన్ పర్యటన
కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ కళకళలాడిపోతోంది. మంగళవారంతో దాదాపు మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 15, 16 తేదీల్లో కడప జిల్లాలో పర్యటిస్తారు.
ఈ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. 15వ తేదీ ఒంటిమిట్టలోని కార్యక్రమం అనంతరం.. అదే రోజు రాత్రి కడపకు చేరుకుని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో ఉంటారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం 9 గంటలకు ఎన్జీవో కాలనీలో ఐఏఎస్ అధికారి మౌర్య వివాహానికి హాజరవుతారు.
అనంతరం ఆదిత్య కళ్యాణమండపంలో మేయర్ సురేష్ బాబు కుమార్తె ముందస్తు వివాహా వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కడప విమానాశ్రయం చేరుకుని కర్నూలు జిల్లాకు సీఎం వెళ్తారు.