ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 మే 2021 (18:17 IST)

విజయవాడ వెన్యూ కన్వెన్షన్ హాల్లో 100 పడకల కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా కోవిడ్ పెషెంట్లకు వైద్య సేవలు అందించేందుకు గాను సమీపంలో గల వెన్వూ ప్రైవేట్ కన్వేన్షన్ హాల్లో 100 పడకల కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించుకోవడం జరిగిందని కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. 
శనివారం జిజిహెచ్ సమీపంలో గల వెన్యూ కన్వెన్షన్ హాల్లో  ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సౌకర్యంతో  వంద పడకల ఆసుపత్రిని కలెక్టరు ఏఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టరు(అభివృద్ది) వైద్యాధికారులుతో కలసి ప్రారంభించారు.
 
ఈ సందర్బంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ లో ప్రజలకు వైద్య సేవలు అందిటిస్తున్న ప్రధాన ఆసుపత్రి అయిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధికంగా కేసులకు వైద్య సేవలు అందించడంతో పాటు అత్యవసర కేసులకు కూడా చికిత్సలు చేస్తున్న విషయం విదితమే. కోవిడ్ పేషెంట్లు అడ్మిషన్ కొరకు ఎదురుచూపులు చూస్తున్నందున జిజిహెచ్ పై ఒత్తిడిని తగ్గించేందుకు గాను అనుబంధంగా వెన్యూ కన్వేన్షన్లో ఆక్సిజన్‌తో కూడిన వంద పడకల ఆస్పత్రిని ఈరోజు నుంచి అందుబాటులోకి తెస్తున్నామనీ కలెక్టరు చెప్పారు.

వెన్యూకన్వెన్షన్లో వంద పడకల ఆస్పత్రి తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించిన సుజనా పౌండేషన్‌కు ధన్యవాదాలు తెలియజేసారు. వెన్యూలో రోగులకు వైద్యం అందించి,విధులు నిర్వహించే వైద్యులు, వైద్య సిబ్బంది, పేషెంట్ల అందరికీ సుజనా పౌండేషన్ వారు భోజన సదుపాయంతో పాటు మంచినీరు వంటి సౌకర్యాలను కల్పిస్తాననడంపై కలెక్టరు అభినందించారు.

అదేవిధంగా ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా పైపు లైన్లకు కనెక్షన్లను బిగించి వాటి ద్వారా పేషెంట్లుకు ఆక్సిజన్ సరఫరా చేయడం జరగుతుందన్నారు. తద్వార జీజీహెచ్ మీద ఒత్తిడిని తగ్గించగలుగుతున్నమన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలు అందిస్తున్నకొంతమంది స్పెషలిస్టు వైద్యులను, సిబ్బందిని సోమవారం నుంచి రొటేషన్ పద్దతిలో కోవిడ్ పెషేంట్లుకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్నబెడ్స్ కు అదనంగా ఈ వంద బెడ్స్ కోవిడ్ పెషేంట్లకు మరింత ఉపయోగ పడతాయని కలెక్టరు అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది)ఎల్ శివ శంకర్, డాక్టర్ సుహాసిని, హాస్పిటల్ సూపరిటెన్డ్డెంట్ శివ తదితరులు పాల్గొన్నారు