ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (09:41 IST)

రేపు ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52ను నింగిలోకి ప్రయోగించనుంది. ఇందుకోసం ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. ఈ ప్రయోగంతో మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించనుంది. 
 
ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైనన ఈ కౌంట‌డౌన్ మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగనుందు. సోమవారం ఉదయం పీఎస్ఎల్వీ సి-52 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగంలో ఐఆర్ శాట్ 1 ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు తయారు చేసిన ఇన్‌స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. మరోవైపు, ఈ యేడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతుంది.