1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మే 2024 (22:47 IST)

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

harish - jawahar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ మహేశ్ కుమార్ గుప్తాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఏపీలో ఈ నెల 13వ తేదీన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై కేంద్ర సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీకి వచ్చిన వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు జారీచేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల‌ని కోరింది. దీంతో స‌చివాల‌యంలో సీఎస్ జవహర్‌ రెడ్డితో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధ‌వారం అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు. కాగా, సీఎస్‌, డీజీపీ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. పోలింగ్ త‌ర్వాత రాష్ట్రంలో నెల‌కొన్న‌ వాస్తవ పరిస్థితులను ఈసీకి వివరించనున్నారు.