ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం ఒకటి పక్కకు ఒరిగిపోయింది. దీన్ని గమనించిన లోకో పైలెట్ రైలును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖపట్టణం సమీపంలోని పెందుర్తి రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగింది.
ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలో విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. అయితే, ఓ విద్యుత్ పోల్ పక్కను ఒరిగిపోయింది. అదేసమయంలో ఆ మార్గంలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్ వస్తోంది. లోకో పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
విద్యుత్ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో దాదాపు గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. రైల్వే సాంకేతిక నిపుణులు ఆ మార్గంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు.