శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (12:37 IST)

ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం.. వాహనంపై దాడి..

elephant
ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం సృష్టించి వాహనంపై దాడి చేసింది. ఈ ఘటన చిత్తూరులోని పలమనేరు గుడియాత్తంలో చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు రికార్డు చేయగా, ప్రస్తుతం ఆ దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఒక ఏనుగు ప్రధాన రహదారిలోకి ప్రవేశించి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపింది. వాహనంపై ఏనుగు దాడి చేయడంతో భయంతో ప్రయాణికులు వాహనంపై నుంచి పరుగులు తీశారు.
 
మరో వాహనంలో ఉన్న వ్యక్తులు ఏనుగు దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించగా.. అది వాహనంపై దాడి చేసింది. చిత్తూరులో ఏనుగుల బీభత్సం రోజురోజుకు పెరుగుతోందని, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.