ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (12:13 IST)

"వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం" వ్యవసాయానికి ప్రభుత్వ సాయం

ys jagan
"వ్యవసాయం దండగ" అంటూ సాగును నిర్లక్ష్యం చేసి అన్నదాతలను కడగండ్ల పాలు చేసిన గత పాలకుల నాటి దుస్థితిని సమూలంగా మార్చేందుకు ఏపీలోని సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం వివిధ రకాలైన పథకాలను అమలు చేస్తుంది. 
 
ఇందులోభాగంగా, 'విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే' అందించే వన్ స్టాప్ సెంటర్లుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద రైతన్నలకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తుంది. 
 
సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఈ-క్రాప్లో నమోదు చేయించి, పంటల బీమా పరిధిలో చేర్చి రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా సాయం ద్వారా ఒక ఖరీఫ్ పంట బీమా పరిహారాన్ని ఆ తర్వాతి ఖరీఫ్ ప్రారంభ సమయం లోపే అందిస్తుంది. 
 
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఏసీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ వస్తుంది. పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తూ.. ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాల ద్వారా రైతన్నకు ఇలా ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ, 'వ్యసాయాన్ని పండగగా'మార్చిన వైకాపా ప్రభుత్వం.. రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తనపనతో ముందుకు సాగిపోతోంది.
 
ఇందులోభాగంగా, వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణికి మరోమారు శ్రీకారం చుట్టింది. రైతన్నలకు ఆర్‌బీకేల వద్దే, మీ గ్రామంలోనే తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతన్నలకు మరింత రాబడి అందించేలా, వారికి మంచి జరిగేలా రూ.2,016 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను జగనన్న ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 
 
3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 1,140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణి. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ జమ వంటి కార్యక్రమాలను చేపడుతుంది.
 
ఒక గ్రామంలోని ఒక రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలను నిర్వహిస్తాయి. పంటల సరళి, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయం. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి సరసమైన అద్దె, సంప్రదించ వలసిన వారి వివరాలు రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శనకు ఉంచుతారు. 
 
రైతులపై పెట్టుబడి భారం లేకుండా రైతు గ్రూపులకు 40 శాతం రాయితీతో సాగు యంత్రాలు, పనిముట్ల సరఫరా.. ఆప్కాబ్, డిసిసిబి ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో 50 శాతం రుణం కూడా తక్కువ వడ్డీకే జగన్ ప్రభుత్వం అందిస్తుంది. అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు ఈ సంవత్సరంలోనే టార్పాలిన్లు, తైవాన్ స్లేయర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ.. వైఎస్సార్ యంత్ర సేవా పథకం సబ్సిడీగా రూ.806 కోట్లు కేటాయించింది. 
 
డ్రోన్ పరికరాల సహాయంతో పంటలకు సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను అందించి రైతన్నలకు పెట్టుబడి ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లో యంత్ర సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేస్తుంది. 
 
పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను మీ గ్రామంలోనే, ఆ బీకేల వద్దే తక్కువ అద్దెకే అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడంతో పాటు నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో 'వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని' ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. 
 
ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హిచ్, డ్రాబార్‌లు ఉచితంగా పంపిణీ.. కంబైన్ హార్వెస్టర్లతో వారంటీ దాటిన తర్వాత కూడా ఒక ట్రాక్ ఉచితం... ఒక సంవత్సరం పాటు హార్వెస్టరు ఉచిత సర్వీసింగ్.. ఆపరేటర్‌కు ఉచిత శిక్షణ ఇస్తుంది. 
 
ఈ పథకం అమలులో భాగంగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యంత్ర పరికరాలతో కలిపి ఇప్పటివరకు 6,781 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు దాదాపు రూ.691 కోట్ల విలువగల ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేస్తుంది. మిగిలిన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు కూడా త్వరలోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోనుంది.