బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:26 IST)

ఫిట్మెంట్ 23 శాతం ఇస్తాం, ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు

పీఆర్సీ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు మంత్రుల కమిటీ-ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల ముందు మంత్రు కమిటీ కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. అందులో ప్రధానమైనది ఫిట్మెంట్ 23 శాతమేనన్నది. దానితో పాటు ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు చేస్తామని తెలిపారు.

 
ఇక హెచ్ఆర్ఎ స్లాబులపై కొత్త ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది కమిటీ. 25 లక్షల లోపు జనాభా వున్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగుతో 13.5 శాతం, 2 లక్షల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 9.5 శాతం, 50 వేల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 8 శాతం హెచ్ఆర్ఎ ఇస్తామని తెలిపింది. మరి దీనిపై ఉద్యోగ సంఘాల స్పందన తెలియాల్సి వుంది.