గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:30 IST)

ఒకవైపు చర్చలు, మరోవైపు ఎస్మా: గనుల శాఖకి ఎస్మా జారీ

పీఆర్సీపై ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు గనులశాఖ నుంచి ఉద్యోగులకు ఎస్మా చట్లం ప్రయోగిస్తామంటూ ఉత్తర్వులు వెళ్లాయి. దీనితో గనుల శాఖలో పనిచేసే ఉద్యోగులు షాక్ తిన్నారు. ఒకవైపు చర్చలు జరుగుతుండగా ఇలా ఎస్మా ప్రయోగించడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 
పైగా గనుల శాఖలో అత్యవసర పనులు ఏముంటాయని ఇలా ఎస్మా ఉత్తర్వులు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాత్రం ఉద్యోగులు ఎవరైనా విధులకు హాజరు కాకపోతే ఎస్మా ప్రయోగం తథ్యం అంటూ ఉత్తర్వులు జారీ చేసారు.