మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (12:21 IST)

విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్

highway
విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై భారత ఆర్మీకి చెందిన విమానాలు దిగనున్నాయి. అత్యవసర సమయాల్లో విమానాలను జాతీయ రహదారులపై ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా పలు జాతీయ రహదారులను తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా రహదారులను భారత సరిహద్దు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల్లో నిర్మించారు. ఇపుడు విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిలో బాపట్ల సమీపంలో ఎయిర్‌ప్యా‌డ్‌ను నిర్మిస్తున్నారు. 
 
16వ నంబరు జాతీయ రహదారి బాపట్ల జిల్లా జె.పంగలూరు మండలం రేణింగవరన, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 4 కిలోమీటర్ల మేరకు సిమెంట్ రోడ్డుతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఈ నెల 29వ తేదీన ట్రయర్ రన్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక కార్గో విమానాన్ని, రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగుతాయి. ఇందుకోసంఅధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఆ రహదారిపై వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తారు.