శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (11:54 IST)

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ

apsrtc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వ రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గురువారం నుంచి పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యా కేంద్రం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన తర్వాత కూడా విద్యార్థులు తిరుగు ప్రయాణం ఉచితంగా చేయొచ్చని సూచన చేసింది. ఉచిత ప్రయాణం చేయాలంటే విద్యార్థులు హాల్‌టిక్కెట్లు చూపించాలని ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.