మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:28 IST)

ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి

కృష్ణాజిల్లాలో 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించేందుకు రూ.599, 94 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ చెప్పారు.

బుధవారం నగరంలోని తమ ఛాంబర్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అమలు పై ఆర్.డబ్ల్యు. ఎస్ ఎస్సీ అమరేశ్వర రావు తో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7,80,637 గృహాలుండగా వాటిలో 2,61,670 ఇళ్లకు మంచినీటి కుళాయిలు వున్నాయన్నారు. 
 
సుమారు 4.50 లక్షలకు ఇళ్లకు మంచినీటి కుళాయి సదుపాయం కల్పించేందుకు, 95910 ఇళ్లకు రెగ్జిష్టింగ్ డిస్ట్రిబ్యుషన్ కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.ఇందుకు సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం లభించగ, ప్రభుత్వ పరిపాలన అమోదం త్వరలో జారీ కానున్నట్ల తెలిపారు.ఇందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి అమరేశ్వర రావు కలెక్టర్ ఇంతియాజ్ మీక్షించారు.