శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (20:15 IST)

క్షేత్ర స్థాయికి అభివృద్ధి ఫలాలు: బిశ్వ భూషణ్

అభివృద్ధి యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర  ప్రజలకు గవర్నర్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గౌరవ హరి చందన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన అనేక సంక్షేమ,  అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని ప్రస్తుతించారు.  ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్యం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలన్నారు. 

ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక వంటిదని ఆ మేరకు పాలన సాగాలని అభిలషించారు. రాబోయే రోజుల్లో పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ముఖ్య లక్షణంగా ఉండాలన్నారు.

సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలలో గొప్ప విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని గౌరవ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్  తెలిపారు.