బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (16:33 IST)

మనమంతా దక్షిణ భారతీయులం... మద్దతివ్వండి: చంద్రబాబు

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా.. జితేందర్ రెడ్డి, వీరప్ప మొయిలీ, రాజీవ్ సాటివ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్‌ను కలిసి ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని కోరారు. ప

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా.. జితేందర్ రెడ్డి, వీరప్ప మొయిలీ, రాజీవ్ సాటివ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్‌ను కలిసి ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని కోరారు. పార్లమెంటుకు చేరుకున్న తర్వాత అన్నాడీఎంకే ఫ్లోర్‌ లీడర్ వేణుగోపాల్‌తో మాట్లాడారు. మనమంతా దక్షిణ భారతీయులమని... ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
 
వేణుగోపాల్ తమ పార్టీ అధిష్టానంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామనీ, పార్టీ అధినేతతో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్ చేరుకున్న చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీ మినహా వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను కలుసుకుని చర్చలు జరుపారు.
 
చంద్రబాబు కలిసిన వారిలో జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమత్రి ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ, రాజీవ్ సాతీవ్, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్ తదితరులున్నారు.