హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషేంట్స్ డేటాను ప్రతి రోజూ ఇవ్వండి: కర్నూలు కలెక్టర్

kurnool collector pandian
ఎం| Last Updated: శనివారం, 1 ఆగస్టు 2020 (18:11 IST)
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషేంట్స్ పూర్తి వివరాల డేటాను మండల, మునిసిపాలిటీ వారీగా ప్రతి రోజూ తాను ఇచ్చిన ప్రొఫార్మలో మెడికల్ ఆఫీసర్స్ ద్వారా, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సేకరించి, ఆన్ లైన్ పోర్టల్ లో అప్లోడ్
చేయాలని, వారి ఆరోగ్య స్థితిని ప్రతి రోజూ పగడ్బందీగా పర్యవేక్షణ చేసి, డేటా ఎంట్రీని ఖచ్చితంగా చేయాలని
హోమ్ ఐసోలేషన్ నోడల్ టీమ్ అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఆదేశించారు.

అలాగే హోమ్ ఐసోలేషన్ పేషేంట్స్ రోజు వారీ డేటా సేకరణ, ఆన్ లైన్ పోర్టల్ లో అప్డేషన్, పర్యవేక్షణ బాధ్యతలను మరింత సమన్వయంతో, సమర్థవంతంగా నిర్వహించాలని అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ డా.వెంకటరమణ, డిపిఓ ప్రభాకర్ రావ్ లను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.

హోమ్ ఐసోలేషన్ పేషేంట్స్ డేటాను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎమ్ లు, ఈ.ఓ.ఆర్డీ లతో, మునిసిపల్ కమీషనర్లతో
రోజూ సేకరించాలని, హోమ్ ఐసోలేషన్ పేషేంట్స్ ఆరోగ్య పరిస్థితి ని మెడికల్ ఆఫీసర్ల ద్వారా పగడ్బందీగా పర్యవేక్షణ చేయించాలని అడిషనల్ డిఎంహెచ్ఓ డా.వెంకటరమణ, డిపిఓ ప్రభాకర్ రావు లను కలెక్టర్ వీరపాండియన్ టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు.

అలాగే డ్వామా పిడి ప్రతి రోజూ పంపిస్తున్న ప్రతి పాజిటివ్ కేసును
హోమ్ ఐసోలేషన్ కేసుగానే పరిగణించి, స్థానిక ఆశా వర్కర్లు, సచివాలయ సెక్రెటరీ, వాలంటీర్, ఏఎన్ఎం లను పేషేంట్ ఇంటికి పంపి
వారిని బయట తిరగకుండా చేయాలని
ఆదేశించారు.

అలాగే
జాప్యం లేకుండా హోమ్ ఐసోలేషన్ నోడల్ టీమ్ డాక్టర్లు సంబంధిత లోకల్ మెడికల్ ఆఫీసర్స్ తో సమన్వయం చేసుకుని పాజిటివ్ పేషేంట్స్ ను కోవిడ్ కేర్ సెంటర్స్
ట్రయాజ్ కు అంబులెన్స్ లేదా ఇప్పటికే పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ వారీగా అనుమతించిన వాహనాల్లో తీసుకువచ్చి, వారి ఆరోగ్య స్థితి, హోమ్ ఐసోలేషన్ సౌకర్యాల స్థితిని బట్టి మెడికల్ ఆఫీసర్ కమిటీ డిసైడ్ చేసి హోమ్ ఐసోలేషన్ కు ఫిట్ ఉన్న పేషేంట్స్ తో అండర్ టేకింగ్ తీసుకోవాలన్నారు.

హోమ్ ఐసోలేషన్ సర్టిఫికేట్ ఇచ్చి మందులు, కరపత్రాల కిట్ ను అందించి హోమ్ ఐసోలేషన్ కు పంపాలని, కో మార్బిడ్ ఉన్న వారికి వారి ఆరోగ్య స్థితిని బట్టి ఆయా కోవిడ్ హాస్పిటల్స్ కు పంపించి జాప్యం లేకుండా అడ్మిట్ చేయించి, ట్రీట్మెంట్ ఇప్పించాలని తద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణ కు కృషి చేయాలని హోమ్ ఐసోలేషన్ నోడల్ టీమ్ అధికారులు, డాక్టర్లను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.

రోజూ నమోదు అయ్యే పాజిటివ్ కేసుల్లో కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ హాస్పిటల్స్ లో అడ్మిషన్ అయిన వారి సంఖ్య పోను, మిగిలిన వారందరినీ హోమ్ ఐసోలేషన్ కేసుగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషేంట్స్
ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగకుండా పగడ్బందీ గా పర్యవేక్షణ చేయాలని, ఒకవేళ హోమ్ ఐసోలేషన్ నిబంధనలను ఎవరైనా అతిక్రమించి బయట తిరిగితే స్థానిక పోలీసు అధికారుల సాయంతో కోవిడ్ హాస్పిటల్స్ కు తరలించి కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకోవాలని హోమ్ ఐసోలేషన్ నోడల్ టీమ్ అధికారులను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.

ప్రణాళికా బద్దంగా పనిచేసి లోకల్ పి.హెచ్.సి, యూ.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్లు, ఏ.ఎన్.ఎం లు, ఈఓఆర్డీలు, గ్రామ, వార్డ్ సచివాలయ కార్యదర్శిలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు తో హోమ్ ఐసోలేషన్ పేషేంట్స్ డేటా ను సేకరించి మండలం, గ్రామం, అర్బన్ స్ట్రీట్ వారీగా డేటా ను అప్లోడ్ చేసి, పగడ్బందీగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా అన్ని కోవిడ్ సమస్యలకు 104 కాల్ సెంటర్ ను వినియోగించుకోవాలని, కాల్ సెంటర్ ద్వారా హోమ్ ఐసోలేషన్ పేషేంట్స్ కు మనో ధైర్యం కల్పించాలని, కాల్ సెంటర్ లో అవసరం అయినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిపిఓ, డి.ఎం.హెచ్ ఓ, అడిషనల్ డిఎం హెచ్ ఓ లను కలెక్టర్ ఆదేశించారు.

హోమ్ ఐసోలేషన్ పేషేంట్స్ డేటా నిర్వాహణను డిపిఓ చేపట్టాలని, వారికి హోమ్ ఐసోలేషన్
మందుల కిట్ అందించడం,
ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ, డిశ్చార్జ్ నిర్వహణను అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ చూసుకోవాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.

అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోవిడ్ కేర్ సెంటర్స్ లో, కోవిడ్ హాస్పిటల్స్ లో
ఎటువంటి జాప్యం, నిర్లక్ష్యం లేకుండా కోవిడ్ పేషేంట్ వచ్చిన అరగంటలో అడ్మిషన్ చేసుకుని, బెడ్ కేటాయింపు చేయాలని, కోవిడ్ కేర్ సెంటర్స్ బాగా నిర్వహిస్తున్నారని, అయినా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంకా బాగా నిర్వహించాలని కోవిడ్ కేర్ సెంటర్స్ నోడల్ టీమ్ అధికారులు ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ, డిడి సెరికల్చర్ వాణి, డి.డి.సోషల్ వెల్ఫేర్ రమాదేవి లను టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు.దీనిపై మరింత చదవండి :