మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (12:10 IST)

వేలానికి శ్రీవారి శేష వస్త్రాలు.. ఎలా పాల్గొనాలంటే?

venkateswara swamy
కోవిడ్ మహమ్మారికి తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం అనుతించబడుతోంది. ఈ మధ్య కాలంలో రికార్డు స్థాయిల భక్తులు పెరుగుతున్నారు. దానికి తగ్గట్లుగానే హుండీ ఆదాయం కూడా గతంలోకంటే భారీగా పెరుగుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. 
 
భక్తుల నుంచి వస్తున్న ఆదరణను బట్టి… టీటీడీ వరుస శుభవార్తలు చెబుతోంది. స్వామివారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను శేష వస్త్రాలుగా ప్రసాదంగా భక్తులు భావిస్తుంటారు. వాటిని తీసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు ఆరాపటడుతుంటారు.
 
ఈ నేపథ్యంలో టీటీడీ స్వామివారి వస్త్రాలను ఈ వేలం వేసేందుకు రెడీ అవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భారీగానే కానుకలు వచ్చాయి. 
 
భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వస్త్రాలను టీటీటీ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 24 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
వేలంలో పాలిస్టర్ నైలాన్, నైలెక్స్ చీరలు, ఆర్ట్ సిల్క్ చీరలు, బ్లౌజ్ పీస్‌లు స్వామివారి సేవకు వినియోగించిన వస్త్రాలు ఉన్నాయి.
 
ధనవంతుల నుంచి సామాన్యులకు వరకు ఈ వేలంలో పాల్గొనవచ్చు. స్వామివారి వస్త్రాలు కొనుగోలు చేసే ఆసక్తిగల భక్తులు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.