మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 13 జులై 2018 (19:38 IST)

మేక్ మై ట్రిప్‌లో ప‌ర్యాట‌క అతిథి గృహాలు... వంటవారికి నెలకు రూ.18,000

ప‌ర్యాట‌క అతిథి గృహాల‌లో ఆక్యుపెన్సీ స్థాయిని పెంచే క్ర‌మంలో మేక్‌ మై ట్రిప్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల‌ని ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ నిర్ణ‌యించింది. శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ 177వ పాల‌క మండ‌లి స‌మావేశం సంస్థ ఛైర్మ‌న్ ఆచార్య జ

ప‌ర్యాట‌క అతిథి గృహాల‌లో ఆక్యుపెన్సీ స్థాయిని పెంచే క్ర‌మంలో మేక్‌ మై ట్రిప్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల‌ని ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ నిర్ణ‌యించింది. శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ 177వ పాల‌క మండ‌లి స‌మావేశం సంస్థ ఛైర్మ‌న్ ఆచార్య జ‌య‌రామి రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో జ‌రిగింది. త‌క్కువ ఆక్యుపెన్సీ ఉన్న అతిథి గృహాల‌కు సంబంధించి మాత్ర‌మే ఈ ఒప్పందం అమ‌ల‌వుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ నిర్వ‌హ‌ణా సంచాల‌కులు హిమాన్హు శుక్లా స‌మావేశం దృష్టికి తీసుకురాగా పాల‌క మండ‌లి అంగీకారం తెలిపింది. 
 
మాన‌వ వ‌న‌రుల ప‌రంగా ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థలో ఉన్న వ్య‌వ‌స్థను ఒక దారిలో పెట్టేందుకు స్ప‌ష్ట‌మైన్ హెచ్ఆర్ పాల‌సీని తీసుకు రావ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త‌ను ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా పాల‌క మండ‌లికి వివ‌రించారు. ఇందుకోసం ఒక ఏజెన్సీని నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. మంచి ప‌నితీరు ప్ర‌ద‌ర్శించే ఉద్యోగుల‌కు  ప్రోత్సాహ‌కాలు ఇచ్చేందుకు కూడా పాల‌క‌మండ‌లి అంగీకారం తెలిపింది.
 
యూనిట్ మేనేజ‌ర్‌తో పాటు మ‌రో ఉద్యోగికి ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఆదాయం పెంపు ప్రాతిప‌దిక‌న ఈ ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌నున్నారు. స‌మాజంలో వంట‌వారికి ఉన్న డిమాండ్‌, కొర‌త‌ను దృష్టిలో ఉంచుకుని వారి వేత‌నాల‌ను రూ.17,500 నుండి 21,500ల‌కు, రూ.15,000 నుండి 18,000ల‌కు పెంచేందుకు అంగీక‌రించారు. మ‌రోవైపు ఒక మాస్ట‌ర్ ఛెప్‌ను ఒక సంవ‌త్స‌ర కాలానికి నియామ‌కం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌ర్యాట‌క అతిథి గృహాల లోని వంట‌వారికి శిక్ష‌ణ అందించాల‌ని నిర్ణ‌యించారు. 
 
అంత‌ర్వేదిలో ప‌ర్యాట‌క సంస్థ అధీనంలో ఉన్న అతిథి గృహాన్ని లీజు ప్రాతిప‌దిక‌న దేవాదాయ శాఖ‌కు ఇచ్చే అంశంపై బోర్డు లోతుగా చ‌ర్చించింది. స‌మావేశంలో పాల‌క‌మండ‌లి స‌భ్యులు వి.రాము, పి. సింహాచ‌లం నాయిడు, సి.బాబూ ర‌మేష్‌, ఎం.బ్ర‌హ్మ‌య్య‌, వీర శంక‌ర రెడ్డి, సంస్ధ ఇడి టివిఎస్‌జి కుమార్‌, జిఎం డాక్ట‌ర్  బి.విశ్వ‌నాధం, హ‌రినాధ్, కంపెనీ సెక్ర‌ట‌రీ టి.సుబ్బారావు పాల్గొన్నారు.