గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (12:24 IST)

అనంతపురం జిల్లాలో గుప్త నిధులు, 10 పురాతన పెట్టెల్లో 15 కేజీల బంగారం

అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రంలో డ్రైవర్ ఇంట్లో తవ్వకాలు జరిపిన పోలీసులు భారీ ఎత్తున దాచియున్న గుప్త నిధిని బయటకు తీసారు. వివరాలిలా వున్నాయి. నాగలింగం అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పోలీసులు తవ్వకాలు ప్రారంభించారు. ఆపై 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించగా అందులో దాదాపు 15 కిలోల బంగారం ఉంది. దాన్ని కవర్ చేసేందుకు మీడియాను పోలీసులు అనుమతించలేదు.
 
ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న మనోజ్ అనే అధికారి వద్ద నాగలింగం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్, నాగలింగంలను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ బంగారం విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతుండగా నేడో రేపో పోలీసుల నుంచి ప్రకటన రానుంది.
 
ఇంట్లో తవ్వకాల్లో బంగారం దొరకడం ఈ ప్రాంతంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది హవాలా బంగారమని ఓ ప్రముఖ నేత బినామీ బంగారమని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కాగా బాలప్ప ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని సోదాలకు వెళితే బంగారం దొరికిందని, ఈ విషయాన్ని లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.