సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (11:48 IST)

పెళ్లికి తర్వాత ప్రియుడితోనే కూతురు.. భర్త వద్దకు వెళ్లలేదు.. తండ్రి ఏం చేశాడంటే?

crime news
ఆధునికత పెరుగుతున్నా.. పరువు హత్యలు ఏమాత్రం తగ్గట్లేదు. పెళ్లికి ముందు మరో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి.. పెళ్లి తర్వాత ఊరుకొచ్చి మళ్లీ తిరిగి వెళ్లలేదు. కుమార్తె ప్రవర్తనతో విసిపిపోయిన తండ్రి.. పరువు పోయిందని.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసి తలను మొండేన్ని వేరు చేశాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరుకు చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ప్రసన్నకు హైదరాబాదుకు చెందిన టెక్కీతో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ప్రసన్న వేరొక వ్యక్తిని ప్రేమించింది. 
 
పెళ్లయ్యాక కూడా అతనిని మరిచిపోలేకపోయింది. పెళ్లయ్యాక గ్రామానికి వచ్చిన ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. దీంతో పరువు పోయిందని భావించిన ప్రసన్న తండ్రి ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. 
 
అక్కడ కుమార్తె మృతదేహం నుంచి తలను వేరు చేసి రెండింటిని వేర్వేరు చోట్ల పడేశారు. ఆపై ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయాడు. అయితే కుటుంబీకులు అతనిని నిలదీయడంతో నిజం చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసన్న తండ్రిని అరెస్ట్ చేసారు.