మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (10:49 IST)

నేడు రేపు వర్షాలు.. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దు...

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని, అందువల్ల జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భలపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. ఇది మరికొద్ది గంటల్లో మధ్యప్రదేశ్ మీదుగా వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీలోని వివత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది. 
 
ఇక మంగళవారం తీరంవెంబడి గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉంటుందో వేచి చూడాల్సివుంది.