ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (22:49 IST)

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఆ ఆరు జిల్లాలకు అలెర్ట్

Rains
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన వుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేసింది.
 
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తుంది. ఫలితంగా కృష్ణా రివర్‌ బేసిన్‌లోని శ్రీశైలం, ప్రకాశం బరాజ్‌లు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడి.. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా విశాఖ, కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతామరాజు, కాకినాడ, జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.