మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:33 IST)

ఏపీలోని ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ హెచ్చరిక

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 24 గంటల్లో ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక చేసింది. పశ్చి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైవుందని ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావం ఆరు జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది. 
 
ఈ కారణంగా విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఈస్ట్ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, గోదావరి జిల్లాలకు గురువారం ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీచేసింది.