గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:33 IST)

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం - 19 నుంచి అసెంబ్లీ?

ys jagan
ఆంప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ భేటీ ప్రారంభమైంది.ఉదయం 11 గంటలకు ఈ భేటీ ఆరంభమైంది. ఈ నెల 19 నుంచి 24 తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ భేటీకి అధిక ప్రాధాన్యత నెలకొంది.
 
గత నెల చివరి నుంచి ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఏపీ మంత్రిమండలి సమావేశం ఈ బుధవారం భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కూడా మంత్రిమండలి చర్చింనుంది.