గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (15:05 IST)

"బిగ్ ‌బాస్" హౌస్‌కెళ్లి తప్పు చేయనున్న పాప్ సింగర్ స్మితా

smitha
కోట్లాది మంది ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించే రియాల్టీ షోలలో "బిగ్ బాస్". గత ఐదు సీజన్లు విజయవంతంగా ముగిసింది. ఇపుడు ఆరో సీజన్ సందడి మొదలైంది. గత ఆదివారం నుంచి ఆరో సీజన్‌కు ఎంపికైన కంటెస్టెంట్లను హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి ఆహ్వానించారు. దీనపై ప్రముఖ పాప్ సింగర్ స్మిత స్పందించారు. బిగ్ బాస్ షో తనకు నచ్చదని తెలిపారు. ఒకవేళ అవకాశం వచ్చినా బిగ్ బాస్ హౌస్‌కెళ్లి తప్పు చేయనని వెల్లడించారు. కుటుంబాన్ని వదిలి అన్ని రోజలు అక్కడ ఉండాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. 
 
ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిగ్ బాస్ షో తనకు నచ్చదని చెప్పిన స్మిత.. ఒక వేళ తనకు ఆ షో నుంచి ఆహ్వానం వస్తే మాత్రం సున్నితంగా తిరస్కరిస్తానని చెప్పారు. వంద రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. 
 
అదేసమయంలో తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఆ షోకు వెళతామని చెబితే ఏం వచ్చింది మీకు? అని నిలదీస్తానని చెప్పారు. కొంతమందిని లగ్జరీ హౌస్‌లో బంధించి.. మీరు తన్నుకోండి.. మేం టీఆర్పీ రేటింగులను పెంచుకుంటామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. పైగా, బిగ్ బాస్ షోను తాను అస్సలు చూడనని, చూసినా నాకు అర్థం కాదని చెప్పారు.